విశాఖ స్టీల్ ప్లాంట్ మరో రికార్డు సాధించింది. జులై నెలలో అత్యధికంగా 540.8 వేల టన్నుల ఉక్కును విక్రయించి రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే 38శాతం ఉత్పత్తి పెరిగింది. ఏప్రిల్ - జులై మధ్య 1,538 వేల టన్నుల ఉక్కును విక్రయించినట్టు ఆర్‌ఐఎన్‌లో ట్విటర్‌లో తెలిపింది. గతేడాదితో పోలిస్తే 48 శాతం వృద్ధి సాధించినట్టు పేర్కొంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న క్రమంలో విశాఖ ఉక్కు రికార్డు నెలకొల్పడం చర్చనీయాంశమైంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు రెండ్రోజులుగా దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
vishaka steel: 540.8వేల టన్నుల ఉక్కు విక్రయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ రికార్డు - విశాఖ స్టీల్ ప్లాంట్ తాజా వార్తలు
జూలై నెలలో 540.8వేల టన్నుల ఉక్కు విక్రయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ రికార్డును నెలకొల్పింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 38% పెరుగుదల నమోదు చేసిందని అందులో వివరించింది.
ఉక్కు విక్రయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ రికార్డు