ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్ రాష్ట్ర బస్సుల్లో టిక్కెట్లు తెగుతున్నాయి! - విశాఖ తాజా వార్తలు

విశాఖ ఆర్టీసీ అంతర్ రాష్ట్ర సర్వీసులను క్రమంగా పెంచుతోంది. ప్రయాణికుల తాకిడి ఉండటంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేట్ (సీట్లు నిండుతున్న శాతం) పెరుగుతోంది. ఒక్క ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచి 28కి పైగా అంతర్ రాష్ట్ర సర్వీసులు నడుపుతున్నారు.

apsrtc
apsrtc

By

Published : Nov 4, 2020, 3:49 PM IST

విశాఖ నుంచి తెలంగాణ వెళ్లే బస్సుల సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరిన మేరకు.. సోమవారం నుంచే విశాఖ ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచి రాజమండ్రి, విజయవాడ సూర్యాపేట మీదుగా హైద్రాబాద్​కు... అలాగే నర్సీపట్నం, చింతపల్లి, సీలేరు మీదుగా భద్రాచలానికి బస్సులు నడుపుతున్నారు. ఇక పక్కనే ఉన్న ఒడిశాకు సైతం సర్వీసులు తిప్పుతున్నారు. ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న మేరకు.. అంతర్ రాష్ట్ర సర్వీస్​లలో ఆకుపెన్సీ రేట్ (సీట్లు నిండుతున్న శాతం) పెరుగుతోంది.

ఒక్క ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచే 28 కి పైగా అంతరాష్ట్ర సర్వీసులు నడుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. అంతర్ రాష్ట్ర సర్వీసులు వినియోగించుకునే ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు కోరారు. అలాగే.. కొవిడ్ నివారణ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. మున్ముందు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, అందుకు అనుగుణంగా బస్సు సర్వీసులు పెంచుతామని అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details