విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం కుడి, ఎడమ సాగునీటి కాలువల సిమెంట్ లైనింగ్ మరమ్మతు పనులను ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు ప్రారంభించారు. జలాశయం పరిధిలో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తానని విప్ అన్నారు. తొలివిడతగా రూ.22 కోట్ల జైకా నిధులతో 9 కిలోమీటర్ల మేర పనులను చేపట్టనున్నట్లు చెప్పారు.
'చివరి ఆయకట్టు వరకు సాగునీరందించేందుకు కృషి చేస్తా'
విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం పరిధిలో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేలా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు అన్నారు. ఈ సందర్భంగా జలాశయం కుడి, ఎడమ సాగునీటి కాలువల సిమెంట్ లైనింగ్ ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించారు.
'రైవాడ జలాశయం చివరి ఆయకట్టు సాగునీటికి కృషి చేస్తా'
అసంపూర్తిగా ఉన్న సాగునీటి కాలువలకు ఇన్నాళ్ల తర్వాత మోక్షం లభించిందని విప్ తెలిపారు. కాలువల అభివృద్ధితో 15,344 ఎకరాలకు సాగునీరు అందుతుందని ముత్యాలనాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ డీఈఈ మాధవి, ఏఈ సత్యంనాయుడు, మాజీ ఎంపీపీ భాస్కరరావు, జలాశయం ఛైర్మన్ తాతయ్యబాబు, తదితరులు పాల్గొన్నారు.