ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాట్‌ఫామ్‌ రూల్స్: లోపలికి వెళ్లేది 8 బయటకు వచ్చేది 1 - విశాఖ రైల్వేస్టేషన్‌ న్యూస్

కరోనా లాక్ డౌన్ సడలింపుల దృష్ట్యా విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. స్టేషన్​ నుంచి బయటకు వచ్చే వారికి ప్లాట్‌ఫామ్‌ 1, లోపలికి వచ్చేవారు ప్లాట్‌ఫామ్‌ 8 వైపు వెళ్లాలని అధికారులు సూచించారు. మిగిలిన దారులన్నీ మూసేస్తున్నట్లు ప్రకటించారు.

Visakhapatnam Railway Station will be strictly implimented Platform Rules from June 1
Visakhapatnam Railway Station will be strictly implimented Platform Rules from June 1

By

Published : May 31, 2020, 9:57 AM IST

కరోనా కట్టడిలో భాగంగా విశాఖ రైల్వే అధికారులు జూన్‌ 1వ తేదీ నుంచి విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. పలు రైళ్ల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో తాజాగా వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం జి.సునీల్‌కుమార్‌ కీలక ప్రకటన విడుదల చేశారు. విశాఖ నగరం నుంచి రైళ్లలో వెళ్లాల్సిన వారంతా జ్ఞానాపురం వైపున్న 8వ ప్లాట్‌ఫాం నుంచి మాత్రమే లోపలికి రావాలని, ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు రైల్లో వచ్చినవారు 1వ ప్లాట్‌ఫామ్‌ నుంచి మాత్రమే బయటికి వెళ్లాలని చెప్పారు. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌ల్లో ఒకే మార్గం తెరిచి ఉంటుందని, మిగిలిన మార్గాలన్నీ మూసేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చి, వెళ్లే ప్రయాణికులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే రాకపోకలకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. బెర్తులు కేటాయించిన వారిని మాత్రమే స్టేషన్‌లోకి అనుమతిస్తామని అన్నారు. కఠిన నిబంధనల నేపథ్యంలో రైలు బయలుదేరే సమయం కన్నా 2 గంటలు ముందే ప్రయాణికులు చేరుకునేలా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details