ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ పోర్టు ట్రస్ట్​ పేరుతో నకిలీ వెబ్​సైట్..పోలీసులకు ఫిర్యాదు - Visakhapatnam port Members complained to the police

విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్​ పేరుతో నకిలీ వెబ్​సైట్​ను సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోర్టు యాజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

సైబర్​క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పోర్టు యాజమాన్యం
సైబర్​క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పోర్టు యాజమాన్యం

By

Published : Oct 4, 2020, 9:17 AM IST


విశాఖపట్టణం పోర్టు ట్రస్టు పేరుతో నకిలీ వెబ్​సైట్​ సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోర్టు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగాల ప్రకటనల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారాన్ని పోర్టు యాజమాన్యం దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన యాజమాన్యం సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని విశాఖలోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. నిరుద్యోగులు ఎవరు ఈ వెబ్​ సైట్​ను చూసి మోసపోవద్దని పోర్టు యాజమాన్యం కోరింది. ఎవరైనా నిరుద్యోగులు నియామకాలకు సంబంధించిన వివరాలు కావాలనుకుంటే, పోర్టు అధికారులను నేరుగా సంప్రదించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details