ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరదేశిపాలెంలో చోరీ కేసు: ముగ్గురు అరెస్ట్, భారీగా బంగారం స్వాధీనం

విశాఖలోని మధురవాడ పరదేశిపాలెంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం చేసినట్లు వారు అంగీకరించారు. వారి నుంచి భారీగా బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

visakhapatnam-police-have-solve-the-paradeshipalem-theft-case
విశాఖ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా

By

Published : Sep 8, 2020, 7:12 PM IST

గత నెల 16న పరదేశిపాలెంలోని ఓ చర్చి ఫాదర్ ఇంట్లో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 40 తులాల బంగారం, మూడు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా... వారు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు.

2017 నుంచి ఈ ముగ్గురు చోరీలకు పాల్పడుతున్నారని నగర కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. వీరిపై ఇప్పటి వరకు విశాఖ నగరంలో 35 కేసులు, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాల్లోనూ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. నిందితుల నుంచి 108 తులాల బంగారం, 153 తులాల వెండి సామగ్రి, లక్ష 69వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ సిన్హా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details