విశాఖలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు దృష్టి పెట్టారు. ప్రతి ఏటా ప్రమాదాలు పెరుగుతున్నందునా... కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారు. కేవలం అపరాధ రుసుములు వసూలు చేయడమే కాకుండా... వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియ కూడా ప్రారంభించారు.
'ఇక ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎఫ్ఐఆర్ నమోదు' - visakha updates
విశాఖ నగర పోలీసు కమిషనరేట్‌కు ప్రధాన సవాలుగా మారిన రోడ్డుప్రమాదాలను నివారించేందుకు పోలీసులు కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. కేవలం అపరాధ రుసుములు వసూలు చేసి వదిలేయకుండా.... వారిపై ఎఫ్.ఐ.ఆర్.లు కూడా నమోదు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించారు.
నగరంలో లక్షలాదిగా ఉన్న వాహనదారులు పెద్దఎత్తున ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుండడం పరిపాటిగా మారింది. ఇక నుంచి ఇష్టారాజ్యంగా వాహనాన్ని నడుపుతున్న వారికి చెక్ పెట్టనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారికి, రేసింగ్‌లకు పాల్పడేవారికి, మైనర్ డ్రైవర్లకు, వారి తల్లిదండ్రులకు గత కొన్నేళ్ల నుంచి కౌన్సిలింగ్ లు ఇస్తున్నా మార్పు రాకపోవడంతో.. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇదీ చదవండి:
తల్లి పొత్తిళ్లల్లో ఉండాల్సిన బిడ్డ.. విగతజీవిగా నడిరోడ్డుపై..!