పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే నీటి కేంద్రాల వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించడంపై విశాఖ జిల్లా చోడవరంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీటి కేంద్రాల వద్ద నివాసాలు ఏర్పాటయితే , ప్రజలకు సరఫరా చేసే తాగునీరు కలుషితం అవుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు వాటర్ వర్క్స్ స్థలాన్ని పరిరక్షించుకుందాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
'తాగునీటి సరఫరా కేంద్రాల వద్ద ఇళ్ల స్థలాలు కేటాయింపులు వద్దు' - చోడవరంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
తాగునీటిని సరఫరా చేసే నీటి కేంద్రాల వద్ద ఇళ్ల స్థలాలు కేటాయింపు వద్దంటూ విశాఖ జిల్లా చోడవరంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీటి కేంద్రాల వద్ద నివాసాలు ఏర్పాటయితే , ప్రజలకు సరఫరా చేసే తాగునీరు కలుషితం అవుతుందని తెదేపా నేత గూనూరు మల్లు నాయుడు తెలిపారు.
తెదేపా నేత గూనూరు మల్లు నాయుడు