Visakhapatnam Light Metro Rail Project: జగనన్నా ఇదేనా నీ చిత్తశుద్ధి - ఎన్నికల ముందు విశాఖ మెట్రో అంటూ ఎందుకీ హడావుడి? Visakhapatnam Light Metro Rail Project: ఎన్నికలకు ఆరు నెలలు ముందు టెంకాయ కొడితే దానిని మోసం అంటారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల లోపు టెంకాయ కొడితే దానిని చిత్తశుద్ధి అంటారని కడప జిల్లాలో 2019 డిసెంబరులో ఉక్కుఫ్యాక్టరీ శంకుస్థాపన సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలివి. ఇన్ని సూక్తులు చెప్పిన ఆయనకు విశాఖపట్నం లైట్ మెట్రోరైలు ప్రాజెక్టు (Vizag Light Metro Rail Project) ఎన్నికలకు ముందే గుర్తుకొచ్చింది.
నాలుగున్నరేళ్లు దీన్ని మర్చిపోయారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీని డీపీఆర్ (Detailed Project Report)ను ఆమోదించారు. దీన్నిబట్టే సీఎం జగన్‌కు ఈ ప్రాజెక్టుపై ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతుంది. మొదట్లోనే ఈ పనులను ఆరంభించినట్లైతే ఈ పాటికి మొదటిదశ అయినా పూర్తయ్యేది. ఇప్పుడు డీపీఆర్‌ని ఆమోదించడమంటే ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించడమే.
YSRCP Government Neglect on Visakha Metro Rail Project: ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటున్న జగన్‌కి.. విశాఖ మెట్రో కనపడలేదా?
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద మెట్రోరైలు ప్రాజెక్టుకు 14 వేల 309 కోట్లు అవుతుంది. ఇందులో రాష్ట్రప్రభుత్వ వాటా 20శాతం కింద 2 వేల862 కోట్లు వెచ్చించాలి. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల గుంతలను పూడ్చేందుకు తట్ట మట్టి కూడా వేయలేని దుస్థితిలో ప్రస్తుతం జగన్ సర్కార్ ఉంది. మరి ఇటువంటి స్థితిలో ఈ ప్రాజెక్టుకు నిధులు ఇస్తుందంటే నమ్మాలా? ఎన్నికలకు ముందు ఇటీవల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినట్లే, విశాఖలో లైట్ మెట్రోరైలు ప్రాజెక్టుకు ఇప్పుడు డీపీఆర్‌ని ఆమోదించి మమ అనిపిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక విజయవాడ, విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టులను అటకెక్కించారు. విశాఖలో పీపీపీ పద్ధతిలో 42.55 కిలోమీటర్ల పొడవున లైట్ మెట్రోరైలు ప్రాజెక్టును 8 వేల 300 కోట్లతో గత ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం విశాఖపై ఎనలేని ప్రేమ కురిపించింది. ఆ నగరాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించింది. అదే అభిమానం మెట్రోరైలు ప్రాజెక్టుపై ఎందుకు చూపలేదన్న ప్రశ్న వినిపిస్తోంది.
Vizag Did Not Develop During YCP Government: విశాఖపై ఎనలేని ప్రేమ చూపిస్తోన్న సర్కార్.. తెరపైకి మెట్రో కథ.. ఇన్నాళ్లూ ఏం చేశారో..!
ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం పంపిన డీపీఆర్ తప్పితే మళ్లీ ఇప్పటివరకు ఏపీ నుంచి నివేదిక రాలేదని కేంద్రం లోక్‌సభలో పలుమార్లు ప్రకటించింది. నాలుగున్నరేళ్లలో సీఎం నాలుగుసార్లు కూడా మెట్రోరైలు ప్రాజెక్టుపై సమీక్షించిన దాఖలాల్లేవు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సమకూర్చాల్సి ఉంటుందని ఇన్ని సంవత్సరాలూ పక్కన పెట్టి, ఎన్నికలకు ముందు బయటకు తీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రతిపాదిత లైట్ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణ పనుల పూర్తికి ఎనిమిదేళ్లు పడుతుంది. దశలవారీగా ప్రాజెక్టు పూర్తిచేయాలని ప్రతిపాదించారు. తొలిదశ పనులను పూర్తిచేసి మెట్రో రైలు పట్టాలెక్కాలన్నా సరే కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుంది. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల పట్టించుకోని జగన్ తీరిగ్గా ఇప్పుడు డీపీఆర్ ఆమోదం తెలిపారు.
Vijayawada Metro Rail Project విజయవాడ మెట్రోకు పాతరేసిన ప్రభుత్వం.. భూసేకరణ ప్రతిపాదన రద్దు చేసిన ప్రభుత్వం