Visakhapatnam Fishing Harbour Fire Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా నష్టపోయాంటూ బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తామంతా రోడ్డున పడ్డామని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ హార్బర్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలికి మంత్రి సీదిరి అప్పలరాజు రాగా.. బాధితులు నినాదాలతో హోరెత్తించారు. ఘటనాస్థలికి సీఎం రావాలని, పరిహారం ఇవ్వాలని నినాదాలు చేశారు.
అయితే ఈ ప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో మొదలవ్వగా.. అగ్నికీలల్లో హార్బర్లో నిలిపి ఉన్న బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిప్రమాదంలో.. 40కి పైగా బోట్లు కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే చేశారని స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదట ఒక బోటుతో మొదలైన మంటలు హార్బర్లో నిలిపి ఉన్న మిగితా బోట్లకు వేగంగా వ్యాపించాయి.
Visakhapatnam Fishing Harbour Fire Accident: అగ్నిప్రమాదంతో రోడ్డునపడ్డ వందలాది కుటుంబాలు - న్యాయం చేయాలంటూ బోరున విలపిస్తున్న బాధితులు విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం - అగ్నికి ఆహుతైన 40 బోట్లు
మిగతా బోట్లను.. అక్కడి నుంచి తరలించేందుకు అవకాశం లేకుండా పోయింది. మంటల్లో చిక్కుకున్న బోట్లలో సిలిండర్లు పేలుతుండటంతో.. మిగితా బోట్లను కాపాడేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. మొత్తం 40 నుంచి 50 బోట్లు వరకు అగ్నికి ఆహుతయ్యాయి.
అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. పోర్ట్ ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సుమారు 4 గంటలు పాటు ఫైర్ ఫైటింగ్ నడిచింది. కొన్ని బోట్లు డీజిల్ నింపుకుని వేటకు సిద్ధం అవుతునప్పుడు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. మరికొన్ని బోట్లు వేట ముగించుకుని ఫిషింగ్ హార్బర్‌కి వచ్చినప్పుడు ప్రమాదం జరగడంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న మత్స్య సంపద కూడా కాలి బూడిదైంది.
నూనె వేడి చేస్తుండగా ఎగిసిన మంటలు - ఏడేళ్ల చిన్నారి మృతి 'భారీగా ఆస్థులు దగ్ధం'
అగ్నిప్రమాదంలో సుమారు 25 నుంచి 30 కోట్లు రూపాయల వరకూ ఆస్తి నష్టం జరిగింది. బోట్ ఓనర్లు, కళాసీలు, మత్స్యకారులు ఉపాధి కోల్పోయామని విలపిస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఘటన స్థలానికి చేరుకుని మత్స్యకారులను ఓదార్చారు.
ప్రభుత్వం అదుకోకపోతే.. మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఇంత ప్రమాదం జరిగినా సంబంధిత శాఖ మంత్రి కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ.. ఫిషింగ్ హార్బర్ ప్రవేశ ద్వారం వద్ద మత్స్యకార నాయకుల ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ వెంటనే ఇక్కడకు వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బొగ్గు గని కంపెనీ ఆఫీస్లో భారీ అగ్నిప్రమాదం- 26మంది మృతి
"ఒక్కో బోటు 60 నుంచి 70 లక్షల రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఇవి కాలిపోవడంతో.. జీవనోపాధి మొత్తం కోల్పోయాము. ఒక్కో బోటుపై 30 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఈ రోజు ప్రమాదంతో సుమారు నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం మేము ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాము. ఈ రోజు ప్రమాదంపై మాకు ప్రభుత్వం నుంచి హామీ రావాలి". - మత్స్యకార నాయకుడు
"ప్రమాదానికి గురైన బోట్లలో.. చాలా వాటిలో చేపలు తీసుకుని వచ్చాయి. ఇంకా వాటిని దించలేదు. ప్రతి బోటులో 8 నుంచి 10 లక్షల రూపాయల వరకూ సరకు ఉంటుంది. మేమే డ్రైవింగ్ చేసుకుని.. వేటకు వెళ్తూ ఉంటాము. అగ్ని ప్రమాదం జరిగిందని.. ఫోన్ వచ్చింది. వెంటనే వచ్చి.. బోట్లను స్టార్ట్ చేసి తీసుకొని వెళ్లిపోదాం అనుకున్నాం. కానీ మంటల వల్ల సాధ్యం కాలేదు". - మత్స్యకార నాయకుడు
పునరావాస కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం, 32 మంది మృతి