ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎట్టకేలకు మోక్షం... రైవాడా జలాశయం గట్టపై చెట్ల తొలగింపు - దేవరాపల్లి మండలం వార్తలు

విశాఖ జిల్లాకు ప్రధాన సాగు నీటి వనరైన రైవాడ జలాశయం మట్టి గట్టుపై తుప్పల ఎట్టకేలకు తొలగింపునకు చర్యలు చేపట్టారు. కూలీలు పనులు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

raiwada reservoir
తుప్పల తొలగింపు ప్రక్రియ

By

Published : Dec 22, 2020, 5:08 PM IST

విశాఖ జిల్లాలో ప్రధానమైన సాగునీటి వనరు దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం. ఈ జలాశయం ప్రధాన మట్టి గట్టుకు ఇరువైపులా దట్టంగా ఏర్పడిన తుప్పలు తొలగింపునకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. చాలా ఏళ్ల తర్వాత అధికారులు చర్యలు చేపట్టారు. ఐదున్నర కిలోమీటర్లు విస్తరించి ఉన్న జలాశయం ప్రధాన మట్టి గట్టుపై కూలీలతో తుప్పల తొలగింపు పక్రియ కొద్దిరోజులుగా జోరుగా సాగుతుంది. త్వరలోనే పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details