డ్వాక్రా సంఘాలకు, మహిళలకు నిస్వార్థ సేవలందిస్తున్న తనను విధుల నుంచి తొలగించేందుకు వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ విశాఖ జిల్లా పద్మనాభం మండలం పొట్నూరు గ్రామపంచాయతీ విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ కొవ్వాడ భారతి వెలుగు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వివోఏకు మద్దతుగా డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2004లో 18 సంఘాలుగా ఉన్న గ్రామాన్ని.. 80 సంఘాల స్థాయికి చేర్చానన్నారు. సేవా దృక్పథంతో ఏళ్ల తరబడి మహిళల ఆర్థిక ఉన్నతికి కృషి చేశానన్నారు.
'నేను ఉండాలా వద్దా?మహిళలే తేల్చుతారు, వైకాపా నాయకులు కాదు' - డ్వాక్రా సంఘాలు
తనను విధుల నుంచి తొలగించేందుకు వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ విశాఖ జిల్లా పద్మనాభం మండలం పొట్నూరు గ్రామపంచాయతీ విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ కొవ్వాడ భారతి ఆరోపించారు. లేని పోని ఆరోపణలు తనపై చేస్తున్నారని వాపోయారు.
2004 నుంచి 2018 డిసెంబర్ వరకు ఎటువంటి వేతనాలు లేకపోయినా కూడా విధులు నిర్వహించేదని తోటి మహిళలు అన్నారు. 2019 జనవరి నుంచి వివోఏలకు 8000 చొప్పున ప్రభుత్వం వేతనం నిర్ణయించిందన్నారు. దీంతో వైకాపా గ్రామ మండల స్థాయి నాయకులు ఎలాగైనా తనను తప్పించాలని లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. వైకాపా నాయకులు నలుగురితో ఫిర్యాదులు చేయిస్తే 400 మంది డ్వాక్రా సంఘాల మహిళలు తనకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. తాను విధుల్లో ఉండాలా వద్దా అనేది డ్వాక్రా సంఘ మహిళలే నిర్వహిస్తారని...వైకాపా నాయకులకు ఆ హక్కు లేదన్నారు. కొంతమంది నాయకుల స్వార్థ ప్రయోజనాలకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఏపీఎం ప్రభాకరరావుకు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి:Payyavula Keshav: విద్యుత్ కొనుగోలు స్కీమ్ కాదు.. అదానీ కోసం చేసే స్కామ్: పయ్యావుల