వాతవరణ అసమతుల్యత కారణంగా ఖరీఫ్ పంటలకు సంబంధించి విశాఖపట్నం జిల్లా నిర్దేశిత లక్ష్యాన్ని చేరడంలో వెనుకంజలో ఉంది. వేసవిలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయని.. ఆ తర్వాత నైరుతి ప్రారంభంలో వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాల్లోకి కొత్త నీరు చేరింది. క్రమేపీ జూలై రెండో వారం వానలు మొహం చాటేయడంతో వర్షాధార ప్రాంతాల్లో పంటల సాగుపై ఆ ప్రభావం పడింది.
విశాఖ జిల్లాకు సంబంధించి 1,02,74 హెక్టార్ల వరినాట్లు వేయాలనేది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 95 వేల 679 హెక్టార్లలో మాత్రమే పంట వేసినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.
గతంతో పోలిస్తే ఎక్కువే..
గత ఏడాదితో పోలిస్తే 4,645 హెక్టార్లు ఎక్కువ విస్తీర్ణంలో వరి నాట్లు పడ్డాయని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా భీమిలి, ఆనందపురం, సబ్బవరం, పరవాడ , బుచ్చయ్యపేట, నక్కపల్లి మండలాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో 60 నుంచి 80 శాతం విస్తీర్ణంలో ఆయా ప్రాంతాల్లో వరినాట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీకి సంబంధించి 42 వేల 996 హెక్టార్లకు గాను 39 ,345 హెక్టార్ల విత్తనం వేయగా.. మైదాన ప్రాంతాల్లో 59 వేల 78 హెక్టార్లకు గాను, 56 వేల 334 హెక్టార్లలో నాట్లు వేసినట్లు స్పష్టం చేశారు.
రెండో ప్రధాన పంట చెరకు..