కరోనా మహమ్మారి వలయంలో చిక్కుకొని ఆదాయం లేక కుటుంబ పోషణ బారమై ప్రజలు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచటం అన్యాయమంటూ విశాఖలో సీపీఐ కార్యకర్తలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ అప్పారావు విగ్రహం వద్ద గ్యాస్ బండలను నెత్తిన పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
గ్యాస్ బండలు నెత్తిన పెట్టుకొని సీపీఐ నిరసన - గ్యాస్ బండలు నెత్తిన పెట్టుకొని సీపీఐ నిరసన వార్తలు
కరోనా కారణంగా పనులు లేక ఆర్ధిక ఇబ్బందులు పడుతుంటే.. కేంద్రం గ్యాస్ ధరలు పెంచటం అన్యాయం అంటూ విశాఖలో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గ్యాస్ బండలను నెత్తిన పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
గ్యాస్ బండలు నెత్తిన పెట్టుకొని సీపీఐ నిరసన
తమ ప్రభుత్వం సామాన్యుల పక్షం అంటూ ప్రచారం చేసుకుంటూ.. ఆ సామాన్యుల నడ్డి విరిచే విధంగా గ్యాస్ ధరలను పెంచారని విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకునే వరకు దశల వారీగా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని సీపీఐ నేతలు హెచ్చరించారు.
ఇవీ చూడండి...
20 ఏళ్ల చరిత్రలో ఎన్నడు లేనంతగా.. రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు
TAGGED:
సీపీఐ నిరసన తాజా వార్తలు