జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నర్సీపట్నం మార్కెట్ యార్డ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి మంగ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో ముఖ్యం అన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు రాము , జిల్లా అధ్యక్షులు స్వామి, కార్యవర్గ సభ్యులు... పాల్గొని మొక్కలను నాటారు.
పత్రికా దినోత్సవం.. మొక్కలు నాటిన పాత్రికేయులు - planting program for celebration of National Press Day
జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో... స్థానిక మార్కెట్ యార్డ్ లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో శ్రేయస్కరమని... ఈ పనికి పాత్రికేయులు పూనుకోవటం హర్షించదగ్గ విషయమ మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు .
జాతీయ పత్రికా దినోత్సవ సంద్భంగా మొక్కలు నాటే కార్యక్రమం