కంకర రాళ్ల వ్యాపారుల అవసరాల కోసం విశాఖ జిల్లా నాతవరం మండలంలో హుటాహుటీన రోడ్డు నిర్మాణం చేయడం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర నాయకులు జేవీ సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. గిరిజనులు ఎంతో కాలంగా రహదారి సదుపాయం కల్పించాలని కోరినప్పటికీ రిజర్వు ఫారెస్ట్ పేరుతో రోడ్డు నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు.
కంకర రాళ్ల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో సీపీఐ నాయకుల బృందం సరుగుడు పంచాయితీ శివారు భమిడికిలొద్ది, అసనగిరి తదితర ప్రాంతాల్లో పర్యటించింది. కంకర (లేటారైట్) తవ్వకాలు జరపడం వల్ల సమీపంలో నదీ జలాలు కలుషితం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.