విశాఖ ఉత్సవ్ ప్రచార చిత్రాన్ని మంత్రి బొత్స సత్య నారాయణ విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవం కోసం ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తునట్టు పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ఇదే సమయంలో ఈ నెల 28 న కైలాసగిరి పై వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్లో ఫ్లవర్ షోను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని తెలిపారు.
విశాఖ ఉత్సవ్ మొదటి రోజు బీచ్లో కళాకారులతో కార్నివాల్ ఉంటుందని... ముగింపు వేడుకలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ముఖ్య అతిధిగా పాల్గొంటారని మంత్రి చెప్పారు. స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, ఎస్ఎస్ తమన్ సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.