ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ విషవాయువు ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి'

విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ సంఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విశాఖ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు లొడగల కృష్ణ కోరారు. బాధితులకు 3 నుంచి 5 కోట్ల రూపాయలు 30 రోజుల్లో చెల్లించాలని డిమాండ్ చేశారు.

Visakha  Telugu Youth President  conference on  lg gas
విశాఖ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడి మీడియా సమావేశం

By

Published : May 12, 2020, 4:25 PM IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీ సంఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విశాఖ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు లొడగల కృష్ణ కోరారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు బాధితులకు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ చట్టం ప్రకారం 3 నుంచి 5 కోట్ల రూపాయలు 30 రోజుల్లో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ కు సింహాచలం భూములను చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెదేపా ప్రభుత్వం ఇచ్చిందని అంబటి రాంబాబు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details