ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదలపై పన్నుభారం మోపేందుకు ప్రభుత్వం యత్నం' - టీడీపీ తాజా వార్తలు

శాసనసభ సమావేశాల నిర్వహణ కన్నా తెదేపా సభ్యుల సస్పెన్షన్​​పైనే వైకాపా ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెదేపా ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. పట్టణవాసులపై పన్నుభారం మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కరోనా వారియర్స్​కి మూడు నెలల నుంచి జీతాలు లేవని ఆక్షేపించారు.

Visakha tdp mlas
Visakha tdp mlas

By

Published : Dec 5, 2020, 3:54 PM IST

వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కన్నా తెదేపా సభ్యుల సస్పెన్షన్​​పై దృష్టి పెట్టిందని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పీవీజీ గణబాబు ఆరోపించారు. విశాఖ తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ప్రజలపై పన్నుల భారం మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పేదలపై పన్నులు వడ్డిస్తోందని ఆరోపించారు.

కరోనా కాలంలో మద్యం వ్యాపారం తప్ప అన్ని రంగాలు దెబ్బతిన్నాయని గణబాబు అన్నారు. కొవిడ్ నియంత్రణలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. కరోనా వారియర్స్​కి మూడు నెలలుగా జీతాలు లేవని, మాస్కులు ఇవ్వలేదని ఆరోపించారు.

రాష్ట్రంలో దుర్మార్గపు పాలనా నడుస్తోందని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మేలు చేస్తామని చెప్పిన సీఎం జగన్​...ఇప్పుడు మాట తప్పారన్నారు. రైతుల కష్టాలను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :'సింహాచలం పంచగ్రామాల సమస్యపై కమిటీల పేరుతో తాత్సారం'

ABOUT THE AUTHOR

...view details