గిరిజనుల సమస్యలు తెలుసుకోవడానికి.. విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య నాలుగు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లి వారితో చర్చించారు. ధర్మవరం వరకు వాహనంలో, ఆపై రావికమతం మండలం చలి సింగంకు కాలినడకన చేరుకున్నారు. గిరిజనుల సంస్కృతులు, సంప్రదాయాలపై అధ్యయనానికి శ్రీకారం చుట్టారు.
గిరిపుత్రుల చెంతకు సబ్ కలెక్టర్ కాలినడక - visakha sub collector mourya with chali singam tribals
కార్యాలయంలో కూర్చొని అధికారులను ఆదేశించే స్థాయిలో ఉంటారు ఓ ఐఏఎస్ అధికారి. అందుకు భిన్నంగా.. గిరిజనుల సమస్యలు స్వయంగా తెలుసుకోవాలనుకున్నారు విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య. కొండల వెంట నాలుగు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి మరీ.. వారి అవస్థలు విన్నారు. పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.

కాలినడకన చలిసింగంకు వెళ్తున్న విశాఖ సబ్ కలెక్టర్
ఈ ప్రాంతానికి చెందిన గిరిజన బాలింత, మరో శిశువు సరైన వైద్యం అందక మృతి చెందిన విషయం సబ్ కలెక్టర్ దృష్టికి వచ్చింది. డోలీ మోతలతో అవస్థలు పడుతున్నామని.. తమకు రోడ్డు సదుపాయం సమకూర్చాలంటూ వారు ఇటీవల నిరసన చేపట్టారు. ఆ పరిస్థితులను పరిశీలించి.. వారి బాధలు వినడానికి స్వయంగా విచ్చేశారు. గిరిజనులతో ముచ్చటించి.. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఇదీ చదవండి:విభజన హామీలను వెంటనే అమలు చేయాలి: ఏఐవైఎఫ్