విద్యార్థులకు సంక్రాంతి పండుగ అవశ్యకత తెలియజేసేలా... విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సంబరాలు నిర్వహిస్తున్నారు. మారుతున్న కాలంలో ఆదరణ కోల్పోతున్న పండుగలకు.. పూర్వ వైభవం తీసుకురావాలని ఆయా కళాశాలల యాజమాన్యాలు కృషి చేస్తున్నాయి. ఉపాధి పేరుతో పల్లె వాసులంతా పట్టణాలకు వెళ్లిపోవడం వల్ల సంక్రాంతి పండుగకు ఆదరణ తగ్గింది. పూర్వం సంక్రాంతి వస్తుందంటే ఇంటి ముందు ముగ్గులు, సాంప్రదాయ దుస్తుల్లో యువతులు సందడి చేసేవారు. ఈ పండుగ ఆవశ్యకతను నేటి యువతరానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే వీటిని నిర్వహిస్తున్నట్లు కళాశాలల యాజమాన్యం తెలిపారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు, సాంప్రదాయ వంటకాలు తయారీపై అవగాహన కల్పించారు.
విశాఖలో ఘనంగా సంక్రాంతి సంబరాలు...! - visakha students sankranthi
ప్రస్తుతం ఆదరణ కోల్పోతున్న పండుగలకు పూర్వ వైభవం తీసుకురావాలని... సంక్రాంతి పండుగ ఆవశ్యకత నేటితరానికీ తెలియజేయాలని... విశాఖలోని పలు కళాశాలల యాజమాన్యాలు కృషి చేస్తున్నాయి. నేటి తరానికి తెలుగు సంప్రదాయం తెలిసేలా సంక్రాంతి ముగ్గులు, సంప్రదాయ వంటకాల తయారీపై అవగాహన కల్పిస్తున్నారు.
విశాఖలో సంక్రాంతి సంబరాలు