ఇదీ చూడండి:
అహ్మదాబాద్ మోతార స్టేడియానికి విశాఖ ఉక్కు - latest news of the famous methara stadium where as trump speech
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని మోటేరా క్రికెట్ స్టేడియం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగానికి ఆతిథ్యమిచ్చి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్టేడియానికి విశాఖ ఉక్కు ఉత్పత్తులనే వినియోగించటం విశేషం. ఈ విషయాన్ని విశాలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (ఆర్ఐఎన్ఎల్ - వైజాగ్ స్టీల్ ప్లాంట్) అధికారులు వెల్లడించారు. ఈ స్టేడియం పనుల కోసం 1,230 టన్నల ఉక్కు ఉత్పత్తుల్ని అహ్మదాబాద్ డాక్ యార్డ్ ద్వారా అందించామని వివరించారు. స్టేడియానికి అతి ముఖ్యమైన రిబార్స్ (పొడవాటి కడ్డీలు) ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మోటేరా మైదానాన్ని ఎల్ అండ్ టీ సంస్థ రూ.667కోట్లతో నిర్మించింది.
అహ్మదాబాద్ మోతార స్టేడియానికి విశాఖ ఉక్కు