తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశమంతటా విస్తరిస్తామని.. భారాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, భాజపా పాలనలో అన్ని వ్యవస్థలూ ధ్వంసమయ్యాయని మండిపడిన ఆయన... వచ్చే ఎన్నికల్లో మార్పు తథ్యమని ఖమ్మం భారాస ఆవిర్భావ సభలో ప్రకటించారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వమన్నారు. విశాఖ ఉక్కును ప్రధాని మోదీ అమ్మితే భారాస అధికారంలోకి వచ్చాక తిరిగి కొంటామని ప్రకటించారు.
విశాఖ ఉక్కుకు భారాస భరోసా.. మోదీ అమ్మితే, మేం వచ్చాక కొంటాం.. - brs meeting at khammam
విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని భారాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన భారాస తొలి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును మోదీ ప్రభుత్వం అమ్మితే.. తాము అధికారంలోకి వచ్చాక కొంటామని భరోసా కల్పించారు.
కేంద్రంలో భారాస అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే భారాస అని పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేస్తామని చెప్పారు. ఎల్‌ఐసీ కోసం భారాస పోరాడుతుందని, విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని స్పష్టం చేశారు. అవసరం ఉన్నచోట వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. దళితబంధును దేశమంతా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మీరు ఇవ్వకపోతే మేము దేశమంతా దళితబంధు ఇస్తాం అని వెల్లడించారు.
ఇవీ చదవండి :