ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రంపై వైకాపా ప్రభుత్వం ఒత్తిడి తేవాలి: విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రంపై వైకాపా ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఉక్కు కార్మిక నంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే వరకు పోరాటం ఆగదని నేతలు తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాలు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 73వ రోజుకు చేరుకున్నాయి.

steel plant protest
విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు

By

Published : Jun 13, 2021, 4:31 PM IST

స్టీల్ ప్లాంట్​కు సొంత గనులు కేటాయించి.. తద్వారా ప్రైవేటీకరణ నిలిపివేయాలని విశాఖ ఉక్కు కార్మిక నేతలు డిమాండ్ చేశారు. అఖిలపక్షం, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 73వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మిక సంఘాల కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.

కేంద్రంపై ఒత్తిడి తేవాలి..

రాష్ట్ర అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే చాలదని.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే వరకు పోరాటం ఆగదని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details