Visakha Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం సరికొత్త రికార్డు నెలకొల్పింది. బ్లాస్ట్ ఫర్నేస్ ఈ ఘనతను నమోదు చేసింది. బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 8100 టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కరోజులో చేసిన ఉత్పత్తి... 8019 టన్నులు మాత్రమే. ఇప్పుడు దానిని తిరగరాసి సరికొత్త ఉత్పత్తి రికార్డు నెలకొల్పింది. సంక్రాంతి నాడు అంటే 15వ తేదీన ఈ ఉత్పత్తి రికార్డును నమోదు చేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం బ్లాస్ట్ ఫర్నేస్ సిబ్బంది దీనిని సాధించడం ద్వారా మరొకసారి తమ దృఢ సంకల్పాన్ని చాటి చెప్పారు. బిఎఫ్1 (గోదావరి బ్లాస్ట్ ఫర్నేస్ ) 1990లో ఉత్పత్తి ప్రారంభించింది. దాదాపు మూడు దశాబ్దాలు పైగా పని చేస్తోంది..ప్రారంభం నుంచి BF1 ఉత్పాదనలో ఇదే అత్యుత్తమ ఉత్పాదన.. దీనిని సాధించినందుకు సిబ్బందిని సీఎండీ అతుల్ భట్ అభినందించారు.
విశాఖ ఉక్కు కర్మాగారం సరికొత్త రికార్డు.. ఒక్క రోజులోనే 8100 టన్నుల ఉత్పత్తి - CMD Atul Bhatt
Visakha Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 8100 టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా బ్లాస్ట్ ఫర్నేస్ పని చేస్తోంది.. ప్రారంభం నుంచి BF1 ఉత్పాదనలో ఇదే అత్యుత్తమం. ఈ ఘనత సాధించిన సిబ్బందిని సీఎండీ అతుల్ భట్ అభినందించారు.
విశాఖ ఉక్కు కర్మాగారం సరికొత్త రికార్డు