తన గానమాధుర్యంతో పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం... ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కుపై ఆలపించిన పాటను విశాఖ ఉక్కు ఉద్యోగులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి విశాఖ ఉక్కు ఎటువంటి ఆభరణమో తెలియజేస్తూ....కార్మికుల కష్టం ఇందులో ప్రతిఫలించేలా బాలు తన గానంలో అద్భుతంగా పలికించారు.
విశాఖ ఉక్కుపై బాలు గానం...అజరామరం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించారనే వార్త ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. ఆయనకు విశాఖ ఉక్కుతో మంచి అనుబంధం ఉంది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
2006లో అప్పటి ఉక్కు సీఎండీ శివసాగరరావు..ఉక్కు కర్మాగారం తెలుగువారికి ఎంత గర్వకారణమన్న అంశంపై బాలుతో పాట పాడించారు. ఆయన స్వరంతో రికార్దయిన ఆ పాటను స్మరించుకుంటూ నివాళులర్పించారు. బాలు మరణంతో ఒక గొప్ప ఆస్తిని తెలుగువారు కొల్పోవాల్సి వచ్చిందని ఉక్కు విశ్రాంత సీఎండీ శివసాగరరావు సంతాపం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'బాలుకు అక్కడే గానగంధర్వ బిరుదును ఇచ్చారు'