జాతీయ ఎస్సీ కమీషన్ వైస్ ఛైర్మన్ అరుణ్ హల్దర్, రాజ్యసభ సభ్యులు సుధాంశు త్రివేదిలు ఈరోజు ఢిల్లీలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. పలు ధార్మిక అంశాలపై చర్చించారు. దళిత వాడలు, గిరిజనవాడల్లో ఆలయాల నిర్మాణం చేపట్టాలని వారికి స్వామీజీ సూచించారు. అలాగే దళిత గోవిందం, గిరిజన గోవిందం తరహా కార్యక్రమాలను చేపట్టాలని విశాఖ శ్రీ శారదాపీఠం తితిదేకి ప్రతిపాదించిందని తెలిపారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సూచించిన వెంటనే సర్వ దర్శనాన్ని టీటీడీ పునః ప్రారంభించిందన్నారు. భగవంతుడిని భక్తులకు చేరువ చేసే విషయంలో విశాఖ శ్రీ శారదాపీఠం వారధిగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
భగవంతుడ్ని భక్తులకు దగ్గర చేసే వారథే విశాఖ శ్రీ శారదాపీఠం - Peetadhipathi Swarupanandendra swami suggestions
జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్ అరుణ్ హల్దర్, రాజ్యసభ సభ్యులు సుధాంశు త్రివేదిలు ఈరోజు ఢిల్లీలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
భగవంతుడ్ని భక్తులకు దగ్గర చేసే వారథే విశాఖ శ్రీ శారదాపీఠం