ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాద్రి అప్పన్న ఉద్యోగులకు వేతన కష్టాలు - simhachalam news

విశాఖ సింహాచల దేవస్థాన ఉద్యోగులకు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కరోనా దృష్ట్యా సగం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు. జూలై, ఆగస్ఠు నెలల్లో ఆ సగం జీతం కూడా ఇవ్వలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సింహాచలం
సింహాచలం

By

Published : Aug 19, 2020, 10:27 AM IST

విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉద్యోగులకు వేతనాలు అందక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ వరకు సగం వేతనాలు ఇచ్చారు. జూలై, ఆగస్టు నెలల్లో అది ఇవ్వలేదు. లాక్ డౌన్ కారణంగా... హుండీ ఆదాయం, ప్రత్యేక పూజలు లేకపోవడంతో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు దేవస్థానం డిపాజిట్​లను ఉద్యోగుల వేతనాలు, బకాయిల చెల్లింపులకు ఉపయోగించకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.

ఈ నెల 5న దేవాదాయ శాఖ అధికారులతో సింహాచలం చైర్​పర్సన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో... పలు అంశాలపై చర్చించారు. స్థిర డిపాజిట్లలో ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని నిర్ణయించారు. ప్రత్యేకంగా ఇతర ఆదాయ వనరులు పెంచుకునే మార్గం పై ఆలోచన చేయాలన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నగర పరిధిలో దేవస్థానానికి ఉన్న భూములు లీజుకు ఇవ్వడం... ప్రత్యేక దర్శనాలు పెంచడం, అనవసర ఖర్చులను తగ్గించుకోవడం చేయాలని సూచించారు.

సింహాచలం దేవస్థాన ఉద్యోగులకు 50 శాతం వేతనాలు అందకపోవడంతో ఉద్యోగుల సంఘం సభ్యులు దేవాదాయ శాఖ మంత్రికి ఇటీవలే వినతిపత్రం అందజేశారు. మంత్రితో చర్చించేందుకు ఆలయ ఈవో భ్రమరాంబ విజయవాడ వెళ్లినట్టు సమాచారం.

  • ఈవో వివరణ...

50 శాతం వేతనాలు చెల్లింపునకు రాబోయే ఆరు నెలలకు సంబంధించి ....మొత్తం దేవస్థానం ఆర్థిక పరిస్థితులపై మంత్రికి వివరాలు అందజేస్తే....ఆయన పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని ఈవో భ్రమరాంబ తెలిపారు. దేవస్థానంలో సుమారు నెలకు 50 లక్షల వరకు చెల్లించాలని ఆయన అన్నారు.

ఇవీ చదవండి:ఆ ఖజానా ఎవరిది..!

ABOUT THE AUTHOR

...view details