ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీరామునిపై నేపాల్ వ్యాఖ్యలు తగవు: స్వరూపానంద సరస్వతి - స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తాజా వార్తలు

కుహనా కుట్ర రాజకీయాలతో నేపాల్ మాట్లాడటం దుర్మార్గపు ఆలోచనని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. శ్రీరాముడిపై నేపాల్​ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాముడిపై తప్పుడు ప్రచారాన్ని ఆపాలని కోరారు.

swami-swarupanandendra-saraswati
విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి

By

Published : Jul 14, 2020, 5:17 PM IST

శ్రీరాముని జన్మభూమిపై నేపాల్ వ్యాఖ్యలను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఖండించారు. రాముడు భారతీయుల ఆరాధ్య దైవమని... ధర్మబద్ధమైన జీవితాన్ని సమాజానికి అందించిన దివ్యమూర్తి అని కొనియాడారు.

భారత్​లో జన్మించి ప్రపంచానికే నడవడికను నేర్పిన మహా పురుషుడు శ్రీరాముడని.. ఆయన గురించి తెలిసీ తెలియక మాటలాడటం తగదన్నారు. పురాణేతిహాసాల చరిత్రను వక్రీకరించడం సబబు కాదని స్వరూపానందేంద్ర సరస్వతి హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details