విశాఖ ఎగుమతుల వాణిజ్య మండలి.. గడచిన ఆర్ధిక సంవత్సరానికి తక్కువగా వృద్ధి రేటు నమోదైనప్పటికి దేశంలో మిగిలిన జోన్ల కంటే మెరుగైన ఫలితాలు సాధించి దేశంలోనే ప్రథమ స్ధానంలో నిలిచింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో కరోనా రెండో వేవ్ లాక్డౌన్ లేనట్టయితే వీఎస్ఈజడ్ మంచి ప్రగతి రేటు నమోదు చేస్తుందని వీఎస్ఈజడ్ ఆభివృద్ది కమిషనర్ ఏఆర్ఎం రెడ్డి అన్నారు.
అన్ని జోన్లతో పోలిస్తే విశాఖ సెజ్ మెరుగైన ఫలితాలు: ఏఆర్ఎం రెడ్డి - Visakha SEZ latest news
దేశంలోని అన్ని జోన్లతో పోలిస్తే విశాఖ సెజ్ మెరుగైన ఫలితాలు సాధించిందని వీఎస్ఈజడ్ అభివృద్ధి కమిషనర్ ఏఆర్ఎం రెడ్డి అన్నారు. ఒక బిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని ఈ ఏడాది సాధించామని వెల్లడించారు.

విశాఖ సెజ్
విశాఖ సెజ్
ఐటీ, ఫార్మా రంగాలు మంచి పురోభివృద్ది ఎగుమతులను నమోదు చేసినట్టు ఆయన వివరించారు. తెలంగాణలో ఐటీ రంగం, ఆంధ్రప్రదేశ్లో ఫార్మా, మౌలిక సదుపాయాల అంశాలు ప్రధాన భూమిక పోషించాయన్నారు. ఒక బిలియన్ ఎగుమతులు లక్ష్యాన్ని ఈ ఏడాది సాధించామని ఏఆర్ఎం రెడ్డి అన్నారు.
ఇవీచదవండి.