ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలకు నిండుకుండలా మారిన జలాశయాలు - పెద్దేరు జలాశయం

మునుపెన్నడూ లేని విధంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖలో జలాశయాలు నిండుకుండలా మారాయి. ఫలితంగా ఈ ఏడాది సాగు, తాగు నీటికి కొరత ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు.

భారీ వర్షాలకు నిండుకుండలా మారిన విశాఖ జలాశయాలు..
భారీ వర్షాలకు నిండుకుండలా మారిన విశాఖ జలాశయాలు..

By

Published : Sep 24, 2020, 10:00 PM IST

విశాఖలో జిల్లాలోని శారద, గోస్తనీ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధానమైన శారద నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన రైవాడ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 3.41 టిఎంసీల నీరు ఉండగా, 374.54 అడుగులు మేర నీటిమట్టం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 647 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 311 క్యూసెక్కులుగా నమోదైంది.

రైవాడ అనంతరం పెద్దేరు..

జిల్లాలో రైవాడ ప్రాజెక్ట్ తర్వాత చెప్పుకునే పెద్దేరులో 0.28 టీఎంసీల నీరు ఉండగా, 444.58 అడుగులు నీటిమట్టం నమోదైంది. ఇన్ ఫ్లో 1058 క్యూసెక్కులు కాగా.. 1058 క్యూసెక్కులు అవుట్ ఫ్లో కొనసాగుతోంది.

సిటీ వాసుల దాహర్తి తీర్చే మేఘాద్రిగడ్డ..

విశాఖ వాసుల దాహార్తి తీర్చే మేఘాద్రిగడ్డ 0.58 టీఎంసీల నీటితో, 55.50 అడుగులు లోతులో ఉంది. మైదాన ప్రాంతాల్లోని నీటి వనరు తాండవ రిజర్వాయర్​లో 4.22 టీఎంసీల నీటితో, 379 అడుగులు నీటిమట్టం ఉంది. ప్రాజెక్టుకు 1070 క్యూసెక్కుల ఇన్​ ఫ్లో ఉండగా.. 1200 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది.

గిరిజన ప్రాంతాలకు కోనాం..

గిరిజన ప్రాంతాలకు నీరు అందించే కోనాం జలాశయం 0.56 టీఎంసీలు ఉండగా, 323.41 అడుగుల నీటిమట్టం వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 760 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా.. 125 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది.

విశాఖలో విస్తారమైన వర్షాలు

విశాఖ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండాయి. ఎక్కువగా కొండలపై పడిన వాన నీటితోనే జలాశయాలు నిండుకుండలా మారాయి. రైవాడ, పెద్దేరు ప్రాజెక్టులు సహా తాండవ, కోనాం జలాశయాలు జిల్లాలోని పంటలు, వ్యవసాయానికి, తాగునీటి కొరతను తీర్చనున్నాయి.

భారీ వర్షాలకు నిండుకుండలా మారిన విశాఖ జలాశయాలు..

ఇవీ చూడండి : అంతర్జాతీయ కర్రసాము 2020లో విశాఖకు పతకాల పంట..

ABOUT THE AUTHOR

...view details