రామతీర్ధంలో విగ్రహం ధ్వంసంపై నిందితుల గుర్తింపు కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని విశాఖ రేంజి డీఐజీ ఎల్వీకె రంగారావు వెల్లడించారు. దేవాలయాల్లో మూర్తులను ధ్వంసం చేస్తున్న ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్నారు. రామతీర్ధంలో ప్రజలు పూర్తి సంయమనం పాటించటంపై ఆయన విశాఖలో సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల వద్ద రక్షణ చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. స్ధానిక యువత ఈ అంశాల్లో పోలీసులకు సహకరించాలని కోరారు.
రామతీర్ధంలో ప్రజలు సంయమనంపై విశాఖ రేంజి డీఐజీ సంతృప్తి - రామతీర్థం విగ్రహం ధ్వంసంపై విశాఖ రేంజి డీఐజీ ఎల్వీకె రంగారావు వ్యాఖ్యలు
రామతీర్ధంలో ప్రజలు పూర్తి సంయమనం పాటించటంపై విశాఖ రేంజి డీఐజీ ఎల్వీకె రంగారావు సంతృప్తి వ్యక్తం చేశారు. విగ్రహం ధ్వంసంపై నిందితుల గుర్తింపు కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
విశాఖ రేంజి డీఐజీ ఎల్వీకె రంగారావు