నర్సీపట్నంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఎన్నికల నిర్వహణలో భాగంగా విశాఖ జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ సరిహద్దుల్లో అవసరమైన చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. ప్రధానంగా అక్రమ మద్యం,నగదు రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 14 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి.... వీటికి సంబంధించి వాహన తనిఖీలు చేపడుతున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ ముఖద్వారం కావడంతో మన్యానికి వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు.