'ఆయుధాలు అప్పగించండి' - విశాఖపట్నం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆత్మరక్షణ కోసం ఆయుధాలు కలిగి ఉన్నవారు వెంటనే పోలీసులకు అప్పగించాలని విశాఖ నగర కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
సాధారణ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆత్మరక్షణ కోసం ఆయుధాలు కలిగి ఉన్న వారు... తిరిగి పోలీసులకు అప్పగించాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ జిల్లా వాసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చాలా వరకు ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగిలిన వారి నుంచి కూడా డిపాజిట్ చేయించుకుంటున్నారు. బ్యాంకులకు, కొన్ని ఆర్ధిక లావాదేవీలు నిర్వహణ పరమైన భద్రత సిబ్బందికి మాత్రం వెసులుబాటు కల్పించారు. విశాఖలో మొత్తం 723 మంది దగ్గర 818 తుపాకులు ఉండగా..అందులో 566 మంది ఆయుధాలను పోలీస్ వద్ద ఇప్పటికే డిపాజిట్ చేశారు. మిగిలిన 241 తుపాకులు బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల రక్షణ సిబ్బంది దగ్గర ఉన్నాయి. మరో 11 ఆయుధాలు డిపాజిట్ కావాల్సి ఉందని త్వరలో వాటిని స్వాధీనం చేసుకుంటామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా చెప్తున్నారు.