ఇవీ చూడండి...
'పాస్‌పోర్టులను రద్దు చేసే అవకాశం లేదు' - visakha passport office latest news update
రాజధాని అమరావతి ఆందోళనలో పాల్గొన్నవారి పాస్‌పోర్టులు రద్దు చేస్తారన్న వార్తలపై... విశాఖ పాస్‌పోర్టు కార్యాలయం స్పందించింది. అవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. పాస్‌పోర్టు చట్టం, నియమనిబంధనల ప్రకారమే రద్దు చేస్తారని తెలిపింది. ఆందోళనలు చేశారన్న కారణంగా రద్దుచేసే అవకాశం లేదని విశాఖ పాస్‌పోర్టు కార్యాలయ అధికారి ఎన్ఎల్పీ చౌదరి వివరించారు. అమరావతిలో అందోళనలు చేస్తున్నవారి పాస్‌పోర్టులు రద్దు అవుతాయన్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
విశాఖ పాస్ పోర్టు కార్యాలయం
TAGGED:
పాస్ పోర్టు చట్టం వార్తలు