ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మారుమూల కొండల్లో ఓ ఆధ్యాత్మిక కేంద్రం - vishaka updates

విశాఖ మన్యం మారుమూల కొండల్లో ఓ ఆధ్యాత్మిక కేంద్రం వెలిసింది. ఐదేళ్లుగా ఆ ప్రాంత గిరిజనులు కృషి చేసి చందాలు వేసుకుని... కొండపై ఆధ్యాత్మిక కుసుమ హర భక్త కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ప్రభుత్వ సహకారంతో కొండపైకి సిమెంట్ రహదారిని నిర్మించుకున్నారు.

Paderu Agency G. Madugula Mandal
మారుమూల కొండల్లో ఓ ఆధ్యాత్మిక కేంద్రం

By

Published : Nov 10, 2020, 9:16 AM IST

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ జి.మాడుగుల మండలం మొండి కోట గ్రామంలో ఐదేళ్లుగా కృషి చేసి చందాలు వేసుకుని ... కొండపై కుసుమహర ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు . నిత్యం పూజలు, భజనలు, ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ సహాయంతో కొండ పైభాగం వరకు రహదారి ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి పూజలు చేశారు.

భక్తులు పాటల పాడుతున్న సమయంలో ఎమ్మెల్యేతో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్​ బాబు చేతులు కలిపారు. ఇటువంటి ఆధ్యాత్మిక చింతన ముందు నుంచే ఉన్నట్లయితే ఏజెన్సీ అంతా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆకాంక్షించారు. కొండపై ఉన్న ఈ దేవాలయం నుంచి దర్శించుకోవడంతో ... ఎప్పుడూ విధుల్లో ఉండే తమకు మానసిక ఉల్లాసం కలిగిందని సీఐ అన్నారు. ఈ సందర్భంగా పాటలు పాడిన భక్త బృందానికి సీఐ... ఎమ్మెల్యే చేతులమీదుగా మహిళలకు కొంత ఆర్థిక సహాయం అందించారు. ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రానికి పాటుపడిన వారందరికీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details