ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఎన్​ఎస్​టీఎల్​ స్వర్ణోత్సవ సంబరాలు...ఉపరాష్ట్రపతి హాజరు - vice president

దేశంలో రక్షణలో కీలక పాత్రపోషించే నౌక దళానికి ఆయుధాలు, సాంకేతికతను అందించడంలో విశాఖ నేవల్ సైన్స్ టెక్నాలజీ లాబొరేటరీది(ఎన్.ఎస్.టి.ఎల్) కీలకపాత్ర. యుద్ధ నౌకలు, జలాంతర్గామిల నుంచి లక్ష్యాన్ని ఛేదించే వీలున్న టోర్పెడోల రూపకల్పన ఇక్కడే జరుగుతుంది. తక్కువ ఖర్చుతో ఆయుధాలు సమకూర్చడంలో ఎన్​ఎస్​టీఎల్​ ప్రముఖస్థానం. ఎనభై వసంతాలు పూర్తి చేసుకున్న ఈ ప్రయోగశాల స్వర్ణోత్సవ సంబరాలకు సిద్ధమైంది. ఈ సంబరాలలో ఉపరాష్ట్రపతి వెంకయ్య పాల్గొనున్నారు.

విశాఖ ఎన్​ఎస్​టీఎల్​ స్వర్ణోత్సవ సంబరాలు

By

Published : Aug 28, 2019, 5:38 AM IST

విశాఖ ఎన్​ఎస్​టీఎల్​ స్వర్ణోత్సవ సంబరాలు

నౌకదళానికి ఆధునిక ఆయుధాలు, సాంకేతికను అందించాలనే ఉద్దేశంతో...తూర్పు నౌకాదళం ప్రధానస్థావరమైన విశాఖలో ఎన్ఎస్​టీఎల్​ను ఆగస్టు 20,1969లో ఏర్పాటుచేశారు. డీఆర్​డీవో పరిధిలోని ఈ నౌకా శాస్త్ర, విజ్ఞాన సాంకేతిక ప్రయోగశాల అంచెలంచెలుగా విస్తరించారు. ఈ కేంద్రంలో 120 కేడబ్ల్యూ కాంట్రా రోటేటింగ్ ఎడ్డీ కరెంట్ డైనోమోమీటర్ సెటప్, అనోకొయిక్ రూం, బంప్ టెస్టింగ్, ఈఏంసీ, ఈఏంఐ ఛాంబర్, హైస్పీడ్ టోయింగ్ ట్యాంకు, ఇన్​స్ట్రుమెంటేషన్ రాడార్ కేంద్రం, నాగార్జున సాగర్ లేక్ టెస్ట్ సదుపాయాలను సీనియర్ శాస్త్రవేత్తలు నేరుగా పర్యవేక్షిస్తారు.

సముద్రగర్భంలో వినియోగించే ఆయుధాలు

సముద్ర గర్భం నుంచి ప్రయోగించే మైన్లు, టోర్పెడోలు, అగ్ని మాపక విధానాలు, వెపన్ లాంచర్లు, టార్గెట్లు, డెకాయ్ లు వంటివి అభివృద్ధి చేసి నౌకాదళాన్ని స్వయం సమృద్ధి చేయడంలో ఎన్ఎస్​టీఎల్​ది ప్రధాన పాత్ర. ఆధునిక ఆయుధాల రూపకల్పన చేసి రక్షణ రంగానికి అందించడం ఎన్ఎస్​టీఎల్ మరో లక్ష్యం. తేలికపాటి, బరువు రకం టార్పెడోలను, మైన్లు, డెకాయి వంటివి అభివృద్ది కోసం నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. నీటిలో ఉపయోగించగల ఆయుధాలు తయారీ, అనుబంధ పరికరాల రూపకల్పన ఈ ప్రయోగశాలలో రూపుదిద్దుకున్నవే.

95 శాతం దేశీయ వస్తువులే

నేవీకి చెందిన నౌకకు దేశంలో తొలిసారిగా ఇన్‌స్ట్రుమెంటేషన్‌ రాడార్‌ ఆర్​సీఎస్​ రేంజింగ్‌ అమర్చిన ఘనత విశాఖ ఎన్​ఎస్​టీఎల్​దే. యుద్ధ నౌకల డెక్‌లపై ఇంజన్ల రొద... నావికులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేలా రెండు దశల మౌంటనీరింగ్‌ విధానం రూపుదిద్దుకుందీ ఇక్కడే. భారత నౌకాదళం కోసం తయారు చేసే టోర్పెడోల్లో 95శాతం దేశీయ వస్తువులనే వాడటంతో.... దిగుమతికయ్యే ఖర్చులో ఆరోవంతులోనే వీటి రూపకల్పన జరుగుతోంది. నీటిలో నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించేందుకు ఈ టోర్పెడోలను అసమానంగా రూపొందించారు.

స్వర్ణోత్సవాలకు ఉపరాష్ట్రపతి

స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని పలు పారిశ్రామిక వర్గాలతో ఎన్​ఎస్​టీఎల్ ఈ ఏడాది వివిధ సమావేశాలు ఏర్పాటు చేసింది. కొద్ది నెలల క్రితం విశాఖ ఎన్​ఎస్​టీఎల్​ను సందర్శించిన అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌.... ఇక్కడ జరిగే పరిశోధన ఫలితాలను త్వరితగతిన సాయుధదళాలకు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. స్వర్ణోత్సవాల సందర్భంగా నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్​ఎస్​టీఎల్​లో జరగనున్న సదస్సుకు హాజరవనున్నారు.

ఇదీ చదవండి :

ఆధైర్య పడకండి... రాజధాని రైతులతో ఉప రాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details