విశాఖ ఎంపీ సత్యనారాయణ కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనారోగ్యాల నిమిత్తం చేరి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయ సహకారాలు అందజేశారు. విశాఖ లా సన్స్ బే కాలనీ ఎంపీ కార్యాలయంలో రూ. 2.52 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆరుగురు లబ్ధిదారులకు అందజేశారు. రేసపువానిపాలానికి చెందిన పూసర్ల వెంకటేశ్వరరావుకి 1లక్ష, వినాయక నగర్‌కి చెందిన ఉప్పాడ రమణమ్మకి 55 వేలు, రాజీవ్ నగర్‌కి చెందిన మల్లూరి నారాయణ రావుకి 40 వేలు, ఎంవీపీ కాలనీకి చెందిన కొర్రా ప్రభావతికి 25 వేలు, పండా వీధికి చెందిన నాయన ఉపేంద్రకి 17 వేలు, గాజువాకకు చెందిన పైడి మాదాన్స్ నివాస్‌కి 15 వేలు చెక్కులను వారికి అందజేశారు.
సీఎం సహాయనిధి ద్వారా ఎంపీ సత్యనారాయణ ఆర్థిక సాయం - visakha dst mp taja news
కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి విశాఖ ఎంపీ సత్యనారాయణ సీఎం సహాయనిధి కింద ఆర్థిక సాయం చేశారు. ఆరుగురికి 2.52లక్షల విలువైన చెక్కును అందించారు.
visakha mp sathyanarayana financial help to people in visakha dst