ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భక్తులకు కనీస వసతులు కల్పించాలి: విశాఖ మేయర్ - కాలభైరవ స్వామిని దర్శించుకున్న విశాఖ మేయర్

భక్తులకు కనీస వసతులు కల్పించాలని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. మేయర్ దంపతులు.. సింహాద్రి అప్పన్న క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు.

Kalabhairava Swami temple
కాలభైరవ స్వామిని దర్శించుకున్న విశాఖ మేయర్

By

Published : Apr 11, 2021, 7:56 PM IST

విశాఖలోని సింహాచలం అప్పన్న క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి దంపతులు దర్శించుకున్నారు. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో భక్తుల రద్దీ పెరుగుతున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని దేవాలయ అధికారులకు సూచించారు.

కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో నాలుగు కిలోమీటర్లు మేర రోడ్డు గతుకులమయంగా ఉండటం, ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details