COURT CANCEL THE BAIL PETITION OF JANASENA ACTIVISTS : విశాఖలో మంత్రుల కార్లపై దాడికి దిగిన జనసేన నేతలకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ మేరకు జనసేన నేతలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విశాఖ కోర్టు కొట్టేసింది. అదే సమయంలో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు.. నిందితులను పోలీసు కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
విశాఖ గర్జన పేరిట ఉత్తరాంధ్ర జేఏసీ విశాఖలో చేపట్టిన కార్యక్రమానికి వైకాపా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మంత్రులు, వైకాపాకు చెందిన కీలక నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరిగిన రోజే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా పవన్‌కు స్వాగతం చెప్పేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జనసైనికులు.. విశాఖ గర్జన ముగించుకుని వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, వైకాపా కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడికి దిగారు.