విశాఖ జిల్లా అనకాపల్లి రేషన్ డిపోలను జేసీ శివశంకర్ పరిశీలించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత రేషన్ సరకుల పంపిణీపై ఆయన డీలర్లతో మాట్లాడారు. జిల్లాలో 4, 487 కేంద్రాలను ఏర్పాటు చేసి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. 5 కేజీల బియ్యం, కిలో శనగలు పంపిణీ చేయడానికి విశాఖ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సామాజిక దూరం పాటించి రేషన్ సరుకులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జేసీ అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిని పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. త్వరలోనే ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేపడుతున్న నేపథ్యంలో.. ఏర్పాట్లు పరిశీలించారు.
రేషన్ డీలర్లతో జాయింట్ కలెక్టర్ భేటీ - second turn ration distributions
విశాఖ జిల్లా అనకాపల్లిలోని రేషన్ డిపోలను విశాఖ జాయింట్ కలెక్టర్ శివశంకర్ పరిశీలించారు. రేపు ప్రారంభం కానున్న రెండో విడత రేషన్ సరకుల పంపిణీపై డీలర్లతో మాట్లాడారు.

రేషన్డీలర్లతో సమావేశమైన జిల్లా జాయింట్ కలెక్టర్