అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు సచివాలయాలు చర్యలు చేపట్టాలని.. విశాఖ సంయుక్త కలెక్టర్ ఎమ్. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం, మొగలిపురం, గొట్టివాడ, ఆరిపాక గ్రామాలలో ఆయన పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో సచివాలయ సేవలను పరిశీలించారు. అక్కడ ప్రదర్శిస్తున్న సిటిజన్ చార్ట్, లబ్ధిదారుల జాబితాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు అవసరమైన అర్హతలను అందరికీ తెలియజేయాలన్నారు. వివిధ గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలనూ జేసీ సందర్శించారు.
పలు సచివాలయాల్లో విశాఖ జేసీ తనిఖీలు - సబ్బవరంలో గ్రామ సచివాలయాలను సందర్శించిన విశాఖ జేసీ
జిల్లాలోని పలు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను విశాఖ జేసీ వేణుగోపాల్ రెడ్డి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని పనుల తీరు, ప్రజలకు అందించే సేవల గురించి ఆరా తీశారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
సచివాలయాల తనిఖీలో విశాఖ సంయుక్త కలెక్టర్