ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"భూదోపిడీలను ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు పెడతారా..?" - విశాఖ తాజా వార్తలు

Peethala Murthy Yadav: తనపై అక్రమ కేసులు పెట్టడాన్ని విశాఖ జనసేన నాయకుడు కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్​ తీవ్రంగా ఖండిచారు. భూదోపిడీల గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఎన్నివిధాలా తనను బెదిరించినా.. వెనక్కి తగ్గనని హెచ్చరించారు. వైకాపా నాయకులు పవన్‌ కల్యాణ్​ను చూసి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

Peethala Murthy Yadav
పీతల మూర్తి యాదవ్​

By

Published : Oct 27, 2022, 6:21 PM IST

Peethala Murthy Yadav: విశాఖలో భూదోపిడీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు. తనపై అక్రమకేసులు పెట్టడానికి కారణాలు ఏంటని అడిగారు. రుషికొండ విధ్వంసంపై పోరాటం చేస్తున్న అక్కసుతో దసపల్లా, హయగ్రీవ భూములను కాపాడాలని పోరాడుతున్నందుకే అక్రమ కేసులు పెట్టారని వాపోయారు. రేడియంట్ సంస్థ నుంచి అక్రమంగా భూములు కాజేయడాన్ని నిలదీసినందుకే వైకాపా కక్ష సాధించిందని అన్నారు. వైకాపా కార్పొరేటర్ల అక్రమ సంపాదనలను నిలదీస్తున్నందుకే తనపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ని బెదిరింపులు చేసినా వెనక్కి తగ్గనని.. తన పోరాటంలో నిజాయతీ ఉందన్నారు. పవన్ కల్యాణ్​ను చూసి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. హయగ్రీవపై నిష్పక్షపాతంగా ఇచ్చిన నివేదికను కలెక్టర్ కాపాడుకోవాలని.. నో అబ్జెక్షన్​ ఇవ్వకుండా ఆపాలిని కోరారు. సిట్​లో ఫిర్యాదు చేసిన భూములను కాపాడాలని అన్నారు. జనసైనికులపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. విశాఖ భూకుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

పీతల మూర్తి యాదవ్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details