ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రెండో విడత కేసులు వచ్చే అవకాశముంది.. సిద్ధంగా ఉండండి' - విమ్స్ ఆసుపత్రి తాజా వార్తలు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు కొవిడ్‌ ఆసుపత్రిగా ఉన్న విశాఖ వైద్య విజ్ఞాన సంస్థలో కొంత కాలంగా కరోనా కేసులు నమోదు కాలేదు. తాము సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇతర కేసుల్నీ అనుమతించాలని గతంలో కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి విమ్స్‌ యంత్రాంగం లేఖ రాసింది. కానీ అటునుంచి సానుకూల స్పందన రాలేదు. ఇలాంటి పరిస్థితిలో విమ్స్‌లో ఏర్పాటు చేయబోయే ప్రాంతీయ ఔషధ గిడ్డంగి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9.66కోట్లు కేటాయిస్తూ శుక్రవారం పరిపాలన అనుమతులు ఇచ్చింది.

Visakha Institute of Medical Sciences
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ

By

Published : Nov 28, 2020, 9:42 AM IST


రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రిగా ఉన్న విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్‌) ఆసుపత్రిలో ఒక్క కొవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు ఇది కొవిడ్‌ ఆసుపత్రిగా ఉంది. అయితే గత 12రోజులుగా ఈ జిల్లాల నుంచి ఒక్క కేసు కూడా ఇక్కడికి రెఫర్‌ అవలేదు. దీంతో ఇక్కడి వైద్యులు ఖాళీగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. తాము సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని, కొవిడ్‌తో పాటు ఇతర కేసుల్నీ అనుమతించాలని గతంలో కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ద్వారా ప్రభుత్వానికి విమ్స్‌ యంత్రాంగం లేఖరాసింది. కానీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందనరాలేదు. 2వ విడత కేసులు వచ్చే అవకాశం ఉందనే నేపథ్యంలో విమ్స్‌ వైద్యులు సిద్ధంగా ఉండాలన్న సమాచారం మాత్రమే ప్రభుత్వం నుంచి ఉంది. దీంతో కేసులు లేకున్నా.. రోజూ ఆసుపత్రికి వెళ్లి రావడం అక్కడి వైద్యులకు ఆనవాయితీగా వస్తోంది. జిల్లాలోని ఇతర కొవిడ్‌ ఆసుపత్రులకు మాత్రం కొవిడ్‌తో పాటు ఇతర కేసులు కూడా చూడొచ్చని ఆదేశాలిచ్చారు.

విమ్స్‌లో ఏర్పాటు చేయబోయే ప్రాంతీయ ఔషధ గిడ్డంగి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9.66కోట్లు కేటాయిస్తూ శుక్రవారం పరిపాలన అనుమతులు ఇచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు అవసరమైన మందుల్ని ఇక్కడినుంచే తరలించేలా ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు పెదవాల్తేరులో ప్రస్తుతమున్న సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌ని ఉన్నతీకరించేందుకు మరో రూ.1.96కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు.

ఇవీ చూడండి...

విశాఖ నకిలీ నోట్ల కేసులో మూడో ఛార్జిషీటు దాఖలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details