ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వందశాతం ప్లేస్​మెంట్స్​తో విశాఖ ఐఐఎం సత్తా - విశాఖ ఐఐఎంలో వందశాతం ప్లేస్​మెంట్స్

విశాఖ ఐఐఎం విద్యార్థులు మ‌రోసారి సత్తా చాటుకున్నారు. 2020-22 బ్యాచ్ విద్యార్ధులు వంద శాతం వేస‌వి ప్లేస్​మెంట్​ల‌ను అత్య‌ధిక పారితోషికంతో ద‌క్కించుకున్నారు. 50 కంపెనీలు ప‌రిమిత కాలానికి పారితోషికంతో కూడిన ఉపాధిని క‌ల్పించేందుకు ముందుకు వ‌చ్చాయి.

Visakha IIM secured  hundred percent   placements.
వందశాతం ప్లేస్​మెంట్స్​తో విశాఖ ఐఐఎం సత్తా

By

Published : Mar 13, 2021, 10:19 AM IST

విశాఖ ఐఐఎం విద్యార్థులు 100 శాతం ప్లేస్​మెంట్​ దక్కించుకున్నారు. అత్య‌ధిక వేత‌నంతో ఐఐఎం విద్యార్ధుల‌ను నియ‌మించుకునేందుకు వివిధ కంపెనీలు ఉత్సాహం చూపెట్టాయి. అత్య‌ధిక పారితోషికం రెండు ల‌క్ష‌లు కాగా.. స‌గ‌టు పారితోషికంగా ల‌క్షా 17 వేల రూపాయిల‌ను నెలకు ఇవ్వనున్నారు. ప్ర‌తి ఏటా వేస‌విలో ప‌రిమిత కాలానికి వీరంతా వివిధ కంపెనీల‌తో ప‌ని చేయాల్సి ఉంటుంది.

ఈ సారి మాత్రం కంపెనీలే అత్య‌ధిక వేత‌నంతో ఐఐఎం విద్యార్ధుల‌ను నియ‌మించుకునేందుకు ఉత్సాహం చూపి పోటీ ప‌డ్డాయి. అత్య‌ధిక ప‌ర్సంటైల్ సాధించిన ప‌దిమందికి స‌గ‌టున ల‌క్షా 46వేల రూపాయిల పారితోషికం ల‌భించ‌నుంది. ఇది గ‌తేడాది స‌గటుతో పోలిస్తే దాదాపు 62,264 రూపాయలు ఎక్కువ‌. క‌నీసం 20.4 శాతం మేర ఈ పారితోషిక శ్రేణి పెరిగింద‌ని ఐఐఎం విశాఖ‌ప‌ట్నం వెల్ల‌డించింది.

ఐటీ, ఎడ్ టెక్, నిర్మాణ రంగం, మౌలిక వ‌స‌తుల రంగం, బ్యాంకులు, ఆహార ప‌రిశ్ర‌మ‌, మార్కెటింగ్ వంటి రంగాల్లో వీరికి అవ‌కాశం ల‌భించింది. ఇందులో దాల్మియా, ఐసీఐసీఐ, ఐఓసీ, ఎంటీఆర్, అవుట్ లుక్, ఆర్బీఐ, ఎస్ బ్యాంకు, టాటా వంటి ప్ర‌ముఖ సంస్థల మాన‌వ‌వ‌న‌రుల విభాగం, మార్కెటింగ్, గ‌ణాంకాలు, ఆర్థిక విభాగం వంటి వాటిల్లో వీరు ప‌ని చేయాల్సి ఉంటుంది. వివిధ సంస్ధ‌లు పోటీగా త‌మ విద్యార్ధుల‌ను తీసుకునేందుకు అస‌క్తి క‌న‌బ‌రచడం సంతోషంగా ఉంద‌ని ఐఐఎం విశాఖ‌ప‌ట్నం డైర‌క్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ అన్నారు.

ఇదీ చూడండి:

తెలుగు కవులకు.. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు

ABOUT THE AUTHOR

...view details