విశాఖ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం - secundrabad
విశాఖ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. నర్సీపట్నం అడ్డరోడ్డు వద్ద లింక్ తప్పడంతో ఇంజిన్ నుంచి బోగీలు వేరుపడ్డాయి. ప్రయాణికులు ఆందోళన చెందారు.
విశాఖ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం..
భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్..నర్సీపట్నం అడ్డరోడ్డు వద్ద లింక్ తప్పింది. కప్లింగ్ వీడటంతో బోగీల నుంచి రైలు ఇంజిన్ వేరైంది. దీంతో కిలోమీటరు వరకు రైలు ఇంజిన్ ముందుకెళ్లింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది వచ్చి వారిని క్షేమంగా వెనక్కు తీసుకెళ్లారు.
Last Updated : Aug 19, 2019, 10:55 PM IST