విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామ శివారులో నాలుగు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గ్రామ శివారులో 400 లారీల ఇసుక నిల్వలను ట్రైనీ డీఎస్పీ రవికిరణ్, అనకాపల్లి గ్రామీణ సీఐ నరసింహారావు, గ్రామీణ ఎస్ఐ రామకృష్ణ గుర్తించారు. కేసును విచారణ నిమిత్తం అనకాపల్లి పట్టణ పోలీసులకు అప్పగించారు.