కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల్ని కట్టడి చేయలేకపోతున్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల విషయంలో ఇబ్బందులెదురవుతున్నాయి. సామాజిక దూరం పాటించాల్సిన ప్రజలు వస్తువులను కొనటం కోసం ఎగబడుతున్నారు. వారిని కట్టడి చేయటానికి అనకాపల్లిలోని గాంధీ కూరగాయల మార్కెట్‌ను ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డులోకి మార్చారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు.
కూరగాయల మార్కెట్ స్థలం మార్పు.. రద్దీ తగ్గింపునకే!
ప్రజలను బయటకు రావద్దని ఎంత చెప్పినా వినటం లేదు. నిత్యావసరాల కొనుగోలుకు ప్రజలు బయటికి రాక తప్పడం లేదు. ఈ మేరకు కరోనా వైరస్ ప్రబలకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు ప్రత్యామ్నాయాలు పాటిస్తున్నారు.
visakha-dst-anakapalli-gandhi-rythu-market-shifted-to-ntr-stadium