వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అనకాపల్లి బెల్లం మార్కెట్లో ఇంత తక్కువ సరకు ఎప్పుడూ రాలేదని అధికారులు చెబుతున్నారు. ఏటా ఈ సీజన్ లో రూ.20 లక్షలకు పైగా బెల్లం దిమ్మెలు యార్డుకి అమ్మకానికి వొచ్చేవని... అలాంటిది ఏడాది పొడవునా అంత సరకు యార్డుకి రావటం లేదని పేర్కొన్నారు. జిల్లాలో చెరకు సాగు తగ్గటం, పంటకు తెగుళ్లు సోకటంతో దిగుబడులు తగ్గినట్లు తెలిపారు. కారణాలు ఏమైనా ఈ ఏటా సీజన్లో యార్డ్ బోసిపోయిందని చెప్పారు.
బోసిపోతున్న బెల్లం మార్కెట్ - విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్ తాజా న్యూస్
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్లో ఈ ఏడాది దిగుబడి పూర్తిగా పడిపోయింది. జిల్లాలో చెరుకు సాగు తగ్గటం, పంటకు తెగుళ్లరావటం ఒక కారణమైతే.. వ్యాపారులే రైతుల దగ్గరనుంచి నేరుగా పంటకొనుగోలు చేయటం మరో కారణంగా అధికారులు భావిస్తున్నారు.
![బోసిపోతున్న బెల్లం మార్కెట్ visakha dst anakapalli bellam market eport and import are down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7554873-404-7554873-1591779102080.jpg)
visakha dst anakapalli bellam market eport and import are down
గత సీజన్ (2018_19) తో పోలిస్తే సుమారు రూ.6 లక్షల దిమ్మెలు తక్కువ వచ్చాయన్నారు. వాస్తవానికి గత సీజన్లో సరకు తక్కువ వచ్చిందని... ఈ సారి అంతకంటే తక్కువ వచ్చిందని యార్డు అధికారులు వివరించారు. ప్రభుత్వం బెల్లానికి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే చెరుకు సాగు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి