ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డాక్టర్​ సుధాకర్​కు వైద్యం అందించే వైద్యుడు​ మార్పు - visakha doctor sudhakar news

మత్తు డాక్టర్​ సుధాకర్​కు చికిత్స అందించే డాక్టర్​ను ఆస్పత్రి సూపరింటెండెంట్​ మార్చారు. తనకు చికిత్స అందించే రాంరెడ్డి సరైన వైద్యం అందించడం లేదని సుధాకర్​ లేఖల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో డాక్టర్​ను మారుస్తూ ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ రాధారాణి నిర్ణయం తీసుకున్నారు.

డా.సుధాకర్​కు వైద్యం అందించే డాక్టర్​ మార్పు
డా.సుధాకర్​కు వైద్యం అందించే డాక్టర్​ మార్పు

By

Published : May 31, 2020, 12:52 PM IST

Updated : May 31, 2020, 2:56 PM IST

మత్తు డాక్టర్​ సుధాకర్​కు చికిత్స అందిస్తున్న డాక్టర్​ను మారుస్తూ ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ రాధారాణి నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ రాంరెడ్డి స్థానంలో డాక్టర్​ మాధవీలతకు బాధ్యతలు అప్పగించారు. రాంరెడ్డి తనకు సరైన చికిత్స అందించడం లేదని గత కొద్ది రోజులుగా సుధాకర్ చెబుతున్నారు. తనకు ఇస్తున్న మందుల కారణంగా ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన విడుదల చేసిన లేఖల్లో పేర్కొన్నారు.

వెంటనే తనను వేరే ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం సుధాకర్ కేసు విషయంలో సీబీఐ అధికారులు జరిపిన సుదీర్ఘ విచారణలో డాక్టర్ రాంరెడ్డిని సైతం అధికారులు ప్రశ్నించారు. సుధాకర్​కు అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో డాక్టర్ రాంరెడ్డిని సుధాకర్​కు చికిత్స అందించే బాధ్యత నుంచి సూపరింటెండెంట్ తప్పించారు.

Last Updated : May 31, 2020, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details